అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి !!
భర్త :- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?
భార్య :- తీసేసానండీ. (నవ్వుతూ)
భర్త :- ఏమి తీసేసావ్?
భార్య :-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.
భర్త :- అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్.
భార్య :-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ వుండకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త :-ఇంకా ఏమి తీసేసావ్?
భార్య :- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.
భర్త :- ఓసి నీ !! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.
భార్య :-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు వుండకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త :-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?
భార్య :-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను.
భర్త :- ఓసి నీ !! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్.
భార్య :-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను.
భర్త :- అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది?
భార్య :- మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.
భర్త :- మరి ఎలా తెరిచావే తల్లీ?
భార్య :- చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది !!
No comments:
Post a Comment