Wednesday, March 30, 2016

సంకల్ప బలం

🐦
సంకల్ప బలం
(కథ)

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది.
అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది-
శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు.

ఆ కధ ఏమంటే
- సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది.
అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది.
ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి.
అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు.
ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు.
ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది.
ఏమి పని మొదలు పెట్టింది. !
తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది.
తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు.
ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు.

ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి!
కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం!
దృఢత!
పౌరుషం!
ఎంతటి ప్రయత్నం.
దాని రోమరోమంలో నిండిపోయింది.
దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి.
మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట.
ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!

ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది.
గరుడుడు పక్షులకు రాజు.
సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట.
"పద నేను చూస్తాను"
అని గరుడుడు కూడా వచ్చాడు.
దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది.
యుక్తికూడా దొరుకుతుంది.
బుద్ధికూడ స్ఫురిస్తుంది.
తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది.
సహాయం చేసేవారు వస్తారు.
వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు.
గరుడుడు వచ్చాడు.
అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.

"ఓ సముద్రమా!
మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు.
నీవేమో ఇవి నన్నేం చేస్తాయి?
క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!"
అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు.
అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు.
పక్షి గుడ్లను తెచ్చి ఇచాడు.
దానికి తన గుడ్లు లభించాయి.

దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి,
మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు,
నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు.
అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది.
కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు.

🌿🐦 🌿🐦🌿 🐦🌿

Wednesday, March 09, 2016

మహాశివరాత్రి

🍀🌹🌻🌹 శివరాత్రికి ఏం చేయాలో ఎలా జరుపుకోవాలో మనము తెలుసుకుందామా  🍀🌹🌻🌹

అ పరమ శివుడు మీ అందరి కుటుంబాల్లో సుఖ శాంతులు ప్రసాదించాలని,మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండేలా దివించాలని ప్రార్తిస్తూ!!

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.

🌹శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

🌻🌹🌻 1.ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

🌹ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

🌻🌹🌻2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.

🌹శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

🌻🌹🌻3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

🌹ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.

🌻🌹🌻4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

🌻🌹🌻5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

🌻🌹🌻6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

🌹శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

🌹🌻ఓం నమఃశివాయ🌻🌹
🌹🌻ఓం నమఃశివాయ🌻🌹
🌹🌻ఓం నమఃశివాయ🌻🌹..

Friday, March 04, 2016

Anger management - it is within you

A monk decides to meditate alone, away from his monastery. He takes his boat out to the middle of the lake, moors it there, closes his eyes and begins his meditation.

After a few hours of undisturbed silence, he suddenly feels the bump of another boat colliding with his own. With his eyes still closed, he senses his anger rising, and by the time he opens his eyes, he is ready to scream at the boatman who dared disturb his meditation.

But when he opens his eyes, he sees it’s an empty boat that had probably got untethered and floated to the middle of the lake.
At that moment, the monk achieves self-realization, and understands that the anger is within him; it merely needs the bump of an external object to provoke it out of him.

From then on, whenever he comes across someone who irritates him or provokes him to anger, he reminds himself, “The other person is merely an empty boat. The anger is within me.”

Wednesday, March 02, 2016

Telugu - a story of love

సింపుల్ మెసేజే కానీ ఇందులో జీవిత పరమార్థం దాగుంది మీరు ఓ సారి చదివి చూడండి. భార్యా , భర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు .. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆఫీస్ కు వెళ్లారు..అదే రోజు ఆఫీస్ లో ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ను ఏర్పాటు చేశారు ఆఫీస్ నిర్వాహకులు అందులో ఈ దంపతులు కూడా పాల్గొన్నారు ట్రైనర్ వచ్చాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ స్టార్ట్ చేశాడు… ప్రాక్టికల్ గా ఏదో చెప్పాలనుకున్నాడు భార్య భర్తల్లో ఒకరిని రమ్మనాడు.. భార్య వెళ్లింది ఆమె చేతికి చాక్ పీస్ ఇచ్చి మీకు బాగా ఇష్టం అయిన 30 పేర్లను బోర్డు మీద రాయమన్నాడు.. వెంటనే తనకు కావాల్సిన వాళ్లను, ఫ్రెండ్స్ ను గుర్తుకుతెచ్చుకొని టపా,టపా ఓ 30 పేర్లను బోర్డు మీద రాసేసింది.
గుడ్ ఇప్పుడు రాసిన వాటి నుండి ఓ 20 పేర్లను తొలగించండి అని అన్నాడు ట్రైనర్..అప్పుడు ఆమె ఆలోచించి తనకు అంతగా అవసరం లేరు అనుకున్న వారి పేర్లను తుడిచేసింది మళ్లీ ఓ ఆరు పేర్లను తుడిచేయండి అని అన్నాడు ట్రైనర్ ఆ సారి బాగా ఆలోచించి ఆరు పేర్లను తుడిచేసింది.
ఈ సారి మిగిలిన నాలుగు నేమ్స్ లో రెండిటిని తీసేయండి అన్నాడు.. చాలా బాధగా తన తల్లిదండ్రుల పేరును డిలేట్ చేసింది ఆ ఉద్యోగిని ఇప్పుడు మిగిలిన రెండు పేర్లలో ఒక పేరుని తీసేయండి అన్నాడు.. అప్పుడు ఆమె రెండు చేతుల్లో ముఖాన్ని అడ్డుపెట్టుకొని ఎడవసాగింది…. హు..తీసేయండి …ఒక పేరును అన్నాడు ట్రైనర్…. అలాగే ఎడుస్తుంది.. పాప పుట్టిన రోజు, ఆ పాపను అల్లారుముద్దుగా పెంచిన తీరు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి అయినా సరే.. అనుకొని తన 3 యేళ్ల పాప పేరును తుడిచేసింది.
బోర్డు మీద ఒకటే పేరు మిగిలింది… ఆ పేరు ఎవరిదో తెలుసా… కట్టుకున్న భర్తది అప్పుడు చెప్పాడు ట్రైనర్ భార్య భర్తల అనుబంధం, అనురాగం అంటే ఇలాగే ఉంటుంది కనిపెంచిన తల్లిదండ్రులను, కన్న పసిపాపను కాదని… భర్త పేరును అలాగే ఉంచింది ఎందుకంటే …. కడదాకా ఒకరికి ఒకరు తోడుగా ఉండేది వాళ్లిద్దరే అన్నాడు ట్రైనర్.
అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాల్ చప్పట్లతో మారుమోగింది.
Love your Wife Love your Husband...
నచ్చితే మీ తోటి మిత్రులకీ షేర్ చేయడం మరువద్దు..
.
.
.

Funny story of money circulation

Masterpiece on Economics :-

One day a tourist comes to the only hotel in a debt ridden town in Kenya. He lays a 100 dollar note on the table & goes to inspect the rooms.

Hotel owner takes the note & rushes to pay his debt to the butcher.

Butcher runs to pay the pig farmer.

Pig farmer runs to pay the feed supplier.

Supplier runs to pay the maid, who in these hard times gave her services on credit.

Maid then runs to pay off her debt to the hotel owner whom she borrowed from in these hard times.

Hotel owner then lays the 100 dollar note back on the counter.

The tourist comes down, takes his money & leaves as he did not like the rooms.

No one earned anything. But that group of people is now without debt & looks to the future with a lot of optimism.
And that is how the world is doing business today!

Worth a read..!!!

Education funny cartoon