Sunday, February 07, 2016

నేటి సమాజంలో మహిళా ఉద్యోగిని పాత్ర


☆ నేటి సమాజంలో మహిళా  ఉద్యోగిని పాత్ర ☆
కోడికూతకు..ముoదే నిదుర లేచి..
గడియారం లో ..సెకన్ల ముల్లు లా....
ఇంటిపని ...వంట పని...కోసం 
చకచకా ..నలువైపులా..తిరుగుతూ..

పిల్లలు క్యారియర్ లు..
సద్దడంలో..కాస్త అయినా
సహాయం వస్తుంది...అని

ఒక పెద్ద...చేతికోసం...
కాసేపు..ఎదురుచూసి
గురక..రాగం ...రాగయుక్తంగా
వినపడితే..
పోన్లే పాపం అని...క్షమించి.

అందరూ...వెళ్లి పోయాక...
కాస్తన్నా...తినే...వ్యవధి లేని
మహిళా ఉద్యోగిని.

నడవడం ...మరిచిపోయి
పరుగు పరుగున వెళ్ళి 
వృత్తి కి న్యాయం చేసే ...క్రమంలో
క్రొవ్వొత్తిలా కరుగుతున్న
ఆరోగ్యాన్ని ...పక్కన పెట్టి

నలుగురు ఎక్కాల్సిన
ఆటో..లో..పదిమందిని
ఎక్కించినా...ఓర్చుకొని
అక్కడక్కడ ..ఎదురయ్యే
వికృత..చేష్టలు చూసి చూడక
అక్కడికక్కడే...మరచిపోయి

అప్పుడప్పుడు..వినబడే 
ద్వందార్థపు...మాటలు..
స్పష్టంగా ...విన్నా...విననట్లు
అప్పటికప్పుడే ..వదిలేసి..
మానవతా మూర్తి.

ముంచుకొచ్చిన దుఃఖం
ఇంటికొచ్చి ...చెప్పుదామనుకుంటే
నీవెంతమటుకు..చనువిచ్చావో...
అని...శల్యపరీక్ష..చేసే...
ఎర్రని...చూపులు..గుర్తొచ్చి 
రేపు..స్నేహితురాలికి..చెప్పుకుందాం అని...బాధను కూడా...వాయిదావేసే..
కరుణా మూర్తి.

పొద్దుణ్ణించి చేసిన సేవలో ..
కనీసం..చిన్న...పొగడ్త న్నా...
దొరుకుతుందేమో...అని..వెతికి ..
లోపాలు ...సుదీర్ఘమైన
విమర్శలు ...మాత్రమే ..దొరికి..
కలుక్కు..మన్న...మనసు
రెండు ..నీటిబొట్లు ..కార్చినా..

మళ్లీ మొదలు పెడుతుంది
అంతే లేని  సమస్యల తో..రణం

కేవలం ...సానుభూతి ..మాత్రమే 
ఆశించే ...ఆ...అల్పజీవి ..
ధన్యమూర్తి.

తనకోసం ..పదిరూపాయలు
స్వేచ్ఛగా ...ఖర్చు పెట్టలేని
సంపాదించే...కడు..పేదరాలు

నడుము వాల్చడానికి
అరగంట ..కేటాయించలేని
మరజీవితపు..అనవాలు

ఆధునిక జీవిత చదరంగంలో 
ఎటుపోవాలో..ఎలావేగాలో..
పాలుపోక ...వీలుకాక...
సతమతమౌతున్న...
మహిళా ఉద్యోగిని ..

ఎపుడైనా ...
ఎప్పుడూ ...అయినా..
ఎదురయితే...
మీ...ఇంట్లో ...కూడా...ఉంటే ...
నా...తరపున ..తెలపండి ..
ఆ..మాతృమూర్తికి..నా..
శత కోటి....పాదాభివందనాలు

సృష్టికి ప్రతి సృష్టినిచ్చే..
ఆమెకే ...ఈ..కవిత అంకితం.
ఎప్పటికీ ...మరెప్పటికీ.



No comments:

Post a Comment